ముంబై ఇండియన్స్‌ 92 ఆలౌట్‌

180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ జట్టు 92 పరుగులకే ఆలౌటై ఓటమిని మూటగట్టుకుంది. దాంతో రాజస్ధాన్‌ రాయల్స్‌ జట్టు 87 పరుగుల తేడాతో ముంబై పై ఘనవిజయం సాధించింది. ముంబై జట్టులో ఒంటిచేత్తో గెలిపించగల హిట్టర్లున్న వారి స్థాయికి తగ్గట్టుగా రాణించక పోవడంతో ఘొరపరాజయాన్ని మూటగట్టుకుంది.రాజస్థాన్‌ జట్టులో ఫాల్కనర్‌ మూడు వికెట్లు ,చండిలా ,కూపర్‌ రెండేసి వికెట్లు తీసుకున్నారు.