ముంబై చేరుకున్నవిరాట్ కోహ్లీ
ముంబయి,నవంబర్25(జనంసాక్షి) : కోల్‌కతా నగరంలో తొలిసారి జరిగిన డే/నైట్ పింక్ టెస్టులో పాల్గొని సోమవారం ఉదయం ముంబయికు తిరిగివచ్చిన విరాట్ కోహ్లీకి, అతని సతీమణి, ప్రముఖ సినీనటి అనుష్కశర్మ ఘనస్వాగతం పలికారు. కోల్‌కతా నగరంలో మూడు రోజుల పింక్ బాల్ టెస్ట్ సిరీస్ అనంతరం వచ్చిన భర్తకు అనుష్కశర్మ ముంబయి విమానాశ్రయానికి వచ్చి చిరునవ్వులతో స్వాగతం పలికారు.ఈ పింక్ టెస్టులో భారత జట్టు బంగ్లాదేశ్ జట్టును ఓడించింది. ఇటీవల అనుష్క విరాట్ దంపతులు భూటాన్ లో పర్యటించారు. భూటాన్ పర్యటనలోనే విరాట్ కోహ్లీ తన జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. భూటాన్ పర్యటన ఫోటోలను అనుష్క శర్మఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.తాత్కాలికంగా సినిమాలకు
విరామం ఇచ్చిన అనుష్కశర్మ కుటుంబంతో గడిపేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు.