ముఖ్యమంత్రిని పిలిపించి మాట్లాడుతాం: వయలార్ రవి
డిల్లీ: ముఖ్యమంత్రిని డిల్లీ పిలిపించి ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ కోరతామని, పార్లమెంటు శీతాకాల సమావేశాల తర్వాత రాష్ట్రంలో పర్యటిస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత వయలార్ రవి తెలిపారు. కేసిఆర్‌ను చర్చలకు ఎవరు పిలిచారన్నది అప్రస్తుతమని, చర్చలు మాత్రం జరిపామని రవి పేర్కొన్నారు. పార్టీ నుంచి వలసలు భారిగా లేవని, పార్టీకి నష్టం లేదని ఆయన తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్టీతోనే ఉంటారని నమ్ముతున్నామని ఆయన పెర్కొన్నారు.