ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్.
తాండూరు అక్టోబర్ 1(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ఆద్వర్యంలోముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించా రు.శనివారం పట్టణంలో ని అంబేద్కర్ చౌక్ లో ఎస్టీలకు 10 శాతం రిజర్వేష న్ కల్పించడంపై గిరిజన నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ , మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నయిమ్, బషీరాబాద్ మండల అధ్యక్షుడు రాములు నాయక్ లు మాట్లాడుతూ గిరిజన సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనతముఖ్యమంత్రి కేసీఆర్ దక్కుతుందని అన్నారు. 6 నుండి 10 శాతం రిజర్వేషన్ కల్పించిన గౌరవముఖ్యమంత్రి కేసీఆర్ కు స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, టిఆర్ఎస్ నాయకులు గిరిజన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.