ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

బోయిన్‌పల్లి: బయ్యారం ఉక్కుగనులను విశాఖ ప్లాంటుకు కేటాయించడాన్ని నిరసిస్తూ తెరాస ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఈరోజు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మండలశాఖ అధ్యక్షుడు కొండయ్య, మాజీ సెన్‌ డైరెక్టర్‌ కొనకట్ల అచ్చిరెడ్డి, నాయకులు గడ్డిమల్లేశం, ఎర్రమల్లయ్య, సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.