ముఖ్యమంత్రి సహాయనిధి పేదవారికి వరం.

పేద బడుగు బలహీనవర్గాలకు అండగా నిలిచే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం.
ప్రజా శ్రేయస్సుకు మన ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా.
తాండూరు అక్టోబర్ 11(జనంసాక్షి) ముఖ్యమం త్రి సహాయ నిధి పేదవారికి వరం లాంటిదని ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా అన్నారు. మంగళవారం అనా రోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రు లలో చికిత్స పొందిన నలుగురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన రూ. 3 లక్షల నలభై వేల ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) చెన్నారం చిట్టి పటేల్, ముద్దాయి పేట శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలకు యేటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగు తుందని తెలిపారు.మండల పరిధిలో అనేక మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు చెప్పారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ గారు నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నార‌ని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు.