ముగిసిన నర్రారాఘవరెడ్డి అంత్యక్రియలు

నల్గొండ:అధికారిక లాంఛనాలతో మార్క్సిస్టు యోధుడు నర్రారాఘవరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఎం కేంద్ర కమిటి సభ్యులు వి.శ్రీనివాసరావు, జానారెడ్డి, ఎంపి గుత్తాసుఖేందర్ రెడ్డి, చుక్కా రామయ్య తదితర వామపక్ష నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.