ముగిసిన రాజీవ్ త్రివేది ట్రయథ్లాన్
హైదరాబాద్: భారత పోలీసు వ్యవస్థ ఏర్పడి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర పోలీసు క్రీడా విభాగం అదనపు డీజీ రాజీవ్ త్రివేది బృందం చేపట్టిన ట్రయథ్లాన్ హైదరాబాద్లో ముగిసింది. ఇందులో భాగంగా డిసెంబర్ 22 నుంచి విశాఖ ఆర్కే బీచ్ వరకు ఈత నిర్వహించారు . డిసెంబర్ 23న విశాఖలో ప్రారంభమైప సైకిల్ యాత్ర నిన్న హైదరాబాద్లో ముగిసింది. చివరగా వరకు పరుగు నిర్వహంచారు. ఇతర రాష్ట్రల పోలీసు అధికారులతోపాటు స్థానిక పోలీసులు ఇందులో పాల్గొన్నారు.