ముగిసిన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

కమాన్‌పూర్‌ : స్థానిక వేణుగోపాల స్వామి ఆలయంలో గత 5 రోజులుగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఉత్సవ విగ్రహాలతో రథోత్సవం నిర్వహించారు. కమాన్‌పూర్‌లోని పలు వీధులగుండా వూరేగింపు నిర్వహించారు. అలయ ఆవరణలో అన్నదానం నిర్వహించారు.