ముగిసిన శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ..

` హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ఆస్తులు రూ.250కోట్లు పైనే!
హైదరాబాద్‌(జనంసాక్షి): హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ ముగిసింది. 8 రోజుల పాటు ఆయన్ను ప్రశ్నించిన అధికారులు కీలక వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది.రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)లోనూ పనిచేసిన కాలంలో స్థిరాస్తి సంస్థలకు మంజూరు చేసిన అనుమతుల వ్యవహారంపై ఏసీబీ ప్రధానంగా దృష్టి సారించినట్టు సమాచారం.ఆయనకు ప్రధానంగా ముగ్గురు బినావిూలు ఉన్నట్టు విచారణలో తేలింది. 214 ఎకరాల భూమి, ఏడు ఇళ్లు, ఒక విల్లా ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు దర్యాప్తులో తేలిన ఆస్తుల విలువ రూ.250 కోట్లు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. శివబాలకృష్ణ కుటుంబసభ్యుల పేర్లపైన 29 ప్లాట్లు ఉన్నట్టు తేలింది. ఆయన సోదరుడు శివనవీన్‌ను కూడా కస్టడీకి తీసుకుని విచారిస్తామని అనిశా అధికారులు తెలిపారు. విచారణ ముగియడంతో కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోసారి కస్టడీ కోరాలని ఏసీబీ భావిస్తోంది.

తాజావార్తలు