ముగ్గురు పేకాట రాయుళ్లు అరెస్ట్
రూ.8,200 నగదు స్వాధీనం
కందుకూరు, జూలై 18 : మండల పరిధిలోని పలుకూరు గ్రామంలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూరల్ ఎస్‌ఐ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఈ దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా 8,200 రూపాయల నగదును పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న నగదును కోర్టుకు హాజరు పరచనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.