ముగ్గురు బాలికల అపహరణ

కడప : నందలూరు మండలం దుర్గాపురానికి చెందిన ముగ్గురు బాలికలు అపహరణకు గురయ్యారు. రెండు రోజుల క్రితం పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బాలికలకు మత్తు మందు ఇచ్చి కిడ్నాప్‌ చేశారు. వీరి నుంచి తప్పించుకొని ఓ బాలిక ఇంటికి చేరింది. పోలీసులు మిగతా ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.