ముగ్గురు వీఆర్వోలు సస్పెండ్‌

ఖమ్మం, (ఏప్రిల్ 3): అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వీఆర్వోలను సబ్ కలెక్టర్ సస్పెండ్ చేశారు.  మణుగూరులో  వీఆర్వోలుగా పని చేస్తున్న ఈ ముగ్గురిపై  గతంలో  అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సబ్ కలెక్టర్ వీరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.