ముఠా కార్మికులను ఆదుకోవాలి

విశాఖపట్టణం,నవంబర్‌19(జనం సాక్షి): ముఠా కార్మికులకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన చట్టాలు గానీ,సహకారం గానీ అందటం లేదని సిఐటియు నాయకులు ఎం.సుబ్బారావు అన్నారు. ముఠా కార్మికులను కార్మికులుగానే గుర్తించకుండా ఇప్పటికీ వారిచేత వెట్టిచాకిరీ చేయిస్తున్నారని అన్నారు. ఉదయం 8 గంటలనుంచి రాత్రి 10 గంటల వరకు కష్టపడినా సరిపడా ఆదాయం రావడం లేదన్నారు. ముఠా కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.ముఠా కార్మికులకు సమగ్రచట్టం చేయాలని, వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలని, విజ్ఞప్తి చేశారు.ముఠా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు. చట్టాలు లేనందున ముఠా కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మాట్లాడుతూ, ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.18,000 నిర్ణయించాలని, అధిక ధరలు అరికట్టాలని, ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌చేశారు.