ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరవండి ` రైతుల భారీ ధర్నా
మెట్‌పల్లి,అక్టోబరు 12(జనంసాక్షి): జగిత్యాల జిల్లా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలంటూ మెట్‌పల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు మెట్‌పల్లి తరలివచ్చి నిరసన తెలిపారు. మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ నుంచి ర్యాలీగా వెళ్లి శాస్త్రి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై మహా ధర్నా చేపట్టారు. చెరకు రైతులను ఆదుకోవాలని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుతో పాటు ధాన్యం కొనుగోలు చేసి రూ.15వేల మద్దతు ధర ఇప్పించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.