*ముదిరాజుల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం.

 చిట్యాల 20(జనం సాక్షి ) ముదిరాజుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి, జెడ్పిటిసి గొర్రె సాగర్ అన్నారు. మంగళవారం మండలంలోని చెరువుల్లో పోయడానికి ప్రభుత్వం  ఉచితంగా అందించే చేప పిల్లలను ఎంపీపీ దావు వినోద వీరా రెడ్డి, జెడ్పీటీసీ గొర్రె సాగర్, డీఎఫ్వో అవినాష్, ఎంపీడీవో రామయ్య, మండల కేంద్రంలో ని మమిడికుంట చెరువులోకి చేప పిల్లలను విడిచిపెట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని అందులో భాగంగానే ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు సొసైటీల ద్వారా అర్హత కలిగిన వారికి చేపలు అమ్ముకునేందుకు కావలసిన వాహనాలనూ, వలలు, ఇతర సామాగ్రిని సబ్సిడీపై అందజేసిందని ఆయన గుర్తు చేశారు.మండలంలో 9 మత్స్య సొసైటీలు రెండు గ్రామ పంచాయతీల పరిధిలో  ఉన్న 46 చెరువుల గానూ 11 లక్షల అరవై రెండు వేల 500 చేపపిల్లలు ఉచితంగా ప్రభుత్వము పంపిణీ చేయడం జరుగుతున్నదన్నారు. సొసైటీలో సభ్యుడిగా ఉండి చేపలవేట కు వెళ్లి మృత్యువాత పడితే వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం  అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మత్స్య సొసైటీ అధ్యక్షులు గుండ రవీందర్ ,ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి చింతల రమేష్, ముదిరాజ్  టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆరెపల్లి మల్లయ్య, కో ఆప్షన్ మెంబర్ ఎండి రాజ్ మహమ్మద్, నాయకులు కొత్తూరు రాజిరెడ్డి, ఏలేటి రాజు, గోల్కొండ సారయ్య, ఆకుల రవి, గుండ స్వామి, బండి సాంబయ్య, ఫక్రుద్దీన్, గోల్కొండ సతీష్, పిట్టల రవి, గుండ నరహరి, తుమ్మ సహదేవ్ ,గోల్కొండ రాజు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.