ముద్దుల కూతురుకు పేరు పెట్టిన ధోని
హైదరాబాద్: ధోని-సాక్షి దంపతుల ముద్దుల కూతురుకు నామకరణం జరిగింది. ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాలో ఉన్న భారత క్రికెట్ కెప్టెన్ ధోని తన కూతురుకు ‘జీవా’ అనే పేరును పెట్టాడు. ఈ పేరుకు పర్షియన్ భాషలో ‘అందం’ అనే అర్థం. గడిచిన శుక్రవారం గుర్గావ్లోని ఆస్పత్రిలో సాక్షి పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం విధితమే. ఈ సందర్భాన్ని పురుస్కరించుకొని ధోనికి టీం ఇండియా మేనేజ్మెంట్ గ్రాండ్ పార్టీ ఇచ్చింది. ఈ వేడుకలో జట్టు సహచరులకు తన చిన్నారి పాప పేరును వెల్లడించాడు.