ముద్దుల కూతురుతో ధోని

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ముద్దుల కూతురు జివాతో మొదటిసారి కనిపించాడు. జార్ఖండ్ రాజధాని రాంచి బిర్సాముండా అంతర్జాతీయ విమానాశ్రయంలో భార్య సాక్షి, కుమార్తె జీవాతో ధోని కెమెరా కంట పడ్డాడు. టీమిండియా క్రీడాకారుడు రైనా వివాహానికి హాజరై తిరిగి ఇంటికి చేరుకొనే సమయంలో ఎయిర్ పోర్టులో మీడియా కంట పడ్డాడు. ధోనీ తన కూతురును ఎత్తుకొని ఉన్న ఫోటోను ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడు.