మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి విజయం ఖాయం టీపీసీసీ కార్యవర్గ సభ్యులు కేతావత్ బిల్యా నాయక్

మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి విజయం కోసం ఎన్నికల ప్రచార చివరి రోజైన మంగళవారంనాడు ముఖ్యమంత్రి ఇన్చార్జ్ గ్రామం లెంకలపల్లి లో టిపిసిసి కార్యవర్గ సభ్యులు కేతావత్ బిల్యా నాయక్ గారు మాజీ మంత్రి, శాసనసభ్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి, దేవరకొండ మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్, చిత్రియాల పిఎసిఎస్ చైర్మన్ జాలె నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల సిరాజ్ ఖాన్, మోతీరామ్, వెంకట్, జైపాల్ నాయక్ లతో కలిసి చివరి రోజు ఎన్నికల ప్రచారం చేశారు ప్రజా సంక్షేమం కోసం పోరాడే కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఉప ఎన్నికలలో ప్రజలు మద్దతు ప్రకటిస్తున్నారని స్వార్థం, కల్మషం లేని స్వచ్ఛమైన మునుగోడు ఆడబిడ్డ పాల్వాయి స్రవంతిని ప్రజలు గెలిపిస్తారన్నారు మునుగోడుపై ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు, రైతులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు అధిక ధరలు,నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న ప్రజలను ఏకతాటిపై తేవడానికి మునుగోడు ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి విజయం కావాలన్నారు కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు ప్రజాసేవ చేసే అవకాశం ఇచ్చిందన్నారు ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికలలో ఆర్యవైశ్య సోదరులు విజ్ఞతతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు ఆర్యవైశ్య సోదరులకు గతంలో స్వర్గీయ కొనిజేటి రోశయ్య గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల గవర్నర్లుగా ఆర్యవైశ్య సోదరులకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కలిగించింది అన్నారు ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులను చేసి ప్రజాసేవ చేసే అవకాశం ఇచ్చిందన్నారు ప్రజలు సంతోషంగా ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని తెలిపారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవి చేపట్టి అవకాశం వచ్చినా వదులుకొని సామాన్య ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ప్రధానమంత్రి అవకాశం వేరే వారికి ఇచ్చారు ప్రజా సంక్షేమం కోసం పోరాడి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ప్రకటిస్తున్నారని అందులో భాగంగానే ఆరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గుర్తించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ప్రకటించారు మునుగోడు నియోజకవర్గ ప్రజలు ముందుచూపుతో ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు అనంతరం మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామం నుండి మునుగోడు మహిళా గర్జనకు సుమారు పదివేల మంది మహిళలను తరలించారు దేశంలో ప్రజలందరూ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వైఫై చూస్తున్నారు అన్నారు భారత్ జోడో యాత్ర ప్రారంభించినప్పటి నుండి వేలాది లక్షలాది మంది యువకులు, ప్రజలు రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటున్నారు అన్నారు మర్రిగూడ మండలంలోని పలు గ్రామాలలో సుమారు గత 20 రోజుల నుండి రాత్రింబవళ్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వయి స్రవంతి విజయం కోసం అహర్నిశలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ కార్యవర్గ సభ్యులు కేతావత్ బిల్యా నాయక్ గారిని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందించారు