మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరికలు
నాంపల్లి సెప్టెంబర్ 1 ( జనం సాక్షి ) మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,సమక్షంలో బిజెపి పార్టీలో కి నాంపల్లి మండల పరిధిలోని రాందాస్ తాండ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 150. మంది కార్యకర్తలు చేరారు. మర్రిగూడెం గెస్ట్ హౌస్ లో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజుగోపాల్ రెడ్డి గురువారం ఆయన మాట్లాడుతూ
మునుగోడు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని ఎమ్మెల్యేగా తనను గెలిపించారని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానాలకు గురిచేసిందని, నియోజకవర్గ సమస్యలపై అనేక పర్యాయాలు అసెంబ్లీలో తన గొంతు వినిపించగా నొక్కే ప్రయత్నం చేశారని, నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేకనే తన రాజీనామాతో కనీసం ప్రభుత్వం దిగివచ్చి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తుందని నమ్మకంతో తన ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా రాజీనామా చేశానని, డబ్బు సంపాదన కోసం అమ్ముడుపోయే వ్యక్తిత్వం తనది కాదని, మునుగోడు నియోజకవర్గంలో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.కార్యకర్తలు, నాయకులు, బిజెపి పార్టీలో చేరారు.
బిజెపి పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి బిజెపి కండువాలను మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఏరెడ్ల రఘుపతి రెడ్డి, బిజెపి నాయకుడు పూల వెంకటయ్య ,రాందాస్ తండ సర్పంచ్ మెగావత్ నీల రవినాయక్,రెడ్యా నాయక్,రవి నాయక్,కృష్ణా నాయక్,రమేష్,తదితరులు పాల్గొన్నారు.