మునుగోడు లో ఉప ఎన్నికలకు జరిగే బిజెపి అభ్యర్థి నామినేషన్ లో పాల్గొన్న చందుపట్ల కీర్తి రెడ్డి !
భూపాలపల్లి ప్రతినిధి అక్టోబర్ 10 జనం సాక్షి : మునుగోడు లో జరిగే ఉప ఎన్నికలకు జరిగే నామినేషన్లు లో సోమవారం బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి అధికార ప్రతినిధి నియోజకవర్గ ఇన్చార్జ్ చందుపట్ల కీర్తి రెడ్డి హాజరైనారు. బిజెపి అభ్యర్థి గెలుపు కొరకు తన వంతు కృషి చేసి రాజగోపాల్ రెడ్డి గెలుపు కొరకు అహర్నిశలు మునుగోడు నియోజకవర్గం లో ప్రచారం నిర్వహించి బిజెపి అభ్యర్థి అయిన రాజగోపాల్ రెడ్డి గెలిపించి తీరుతానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.