మున్సిపల్ కార్మికులకు పిఆర్సి ని అమలు చేయాలి.

జాతీయ బీసీ సంఘం సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి.
తాండూరు నవంబర్ 10(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కార్మికులు విధులను బహిష్కరించి గత ఆరు రోజులుగా సమస్యలను పరిష్కరించాలని దీక్ష చేపట్టారు. మున్సిపల్ కార్మికుల దీక్షకు మద్దతు తెలిపిన జాతీయ బీసీ సంఘం సభ్యులు తాండూర్ నియోజవర్గ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి రాష్ట్ర బీసీ కార్యదర్శి సయ్యద్ సుకుర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారి తాండూర్ నియోజవర్గ మహిళా అధ్యక్షురాలు నాయి కోడి జ్యోతి ,తాండూర్ మండల బిసి యువజన సంఘం అధ్యక్షుడు బసంత్ కుమార్ ,సోషల్ మీడియా ఇంచార్జ్ బస్సు, యువ నాయకులు రాము ముదిరాజ్, జుంటుపల్లి వెంకట్, మహిళా నాయకురాలు విజయలక్ష్మి ,మతమతిన్ మాధవ్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా రాజ్ కుమార్  మాట్లాడుతూ గత ఆరు రోజుల నుండి  మున్సిపల్ కార్మికులు విధులను బహిష్కరించి రోడ్డుపై వచ్చి దీక్ష చేస్తుండడం చాలా విచారకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రమంతా కొత్త పిఆర్సి అమలవుతుంటే తాండూర్ పట్టణంలో మాత్రం కొత్త పిఆర్సి అమలు కోసం రోడ్డుపైన వచ్చి దీక్ష చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. వెంటనే కొత్త పిఆర్సి తాండూర్ కార్మికులకు వచ్చే విధంగా పాలకులు కృషి చేయాలని లేనిచో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు .రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ సుకుర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారి మాట్లాడుతూ కార్మికులకు పూర్తి మద్దతు ఉంటుందని వెంటనే వాళ్ల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.