మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలి ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కిరణ్
మక్తల్ సెప్టెంబర్ 27 (జనంసాక్షి) మున్సిపల్ కార్మికులకు కనీసం 26 వేల రూపాయలు వేతనం పెంచాలని ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు యస్ కిరణ్ అన్నారు. మక్తల్ మున్సిపల్ కార్యాలయం దగ్గర మున్సిపల్ కార్మికుల సమస్యలపై కరపత్రం పంచుతూ ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు యస్ కిరణ్, తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మక్తల్ అధ్యక్షులు ఈశ్వరయ్య, ఉపాధ్యక్షులు కొలిమి రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు 13 కార్పొరేషన్లు ఉన్నాయన్నారు. వీటిలో సుమారు 60 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. దేశ ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి మున్సిపల్ కార్మికులను దేవుళ్ళు అంటూ శాలువాలు కప్పి సత్కరిస్తూ వాళ్లు చేసిన సేవలు మరువలేని అని కొని ఆడారు. మానవుడి మలమూత్ర విసర్జనను చెత్త చెదారాన్ని కుళ్ళి దుర్వాసన స్థితిలో మున్సిపల్ కార్మికులు చేతులతో శుభ్రం చేపడుతున్నారు. డ్రైనేజీలలో మునిగి దిగి పనిచేసే దుర్వాసన అందులోని శవాలుగా మారిన ఘటనలు అనేకంగానే జరుగుతున్నాయి. మున్సిపల్ కార్మికులకు న్యాయబద్ధమైన వేతనాలు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రంలో కనీస వేతనం ఇరవై ఒకటి వేలుగా నిర్ణయించి జీవో విడుదల చేశారని అన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రాం లో వేతనాలు పెంచలేక కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. మున్సిపల్ కార్మికుల వేతనాలు 20 ఆరువేలుగా నిర్ధారించాలన్నారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అన్నారు. మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించి డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. పి ఆర్ సి 30% ఫిట్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని అన్నారు. ప్రతినెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించి ఇవ్వాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో గంగన్న, ఆశన్న,రవి,బండారి బాలు,జి కృష్ణయ్య, మహేశ్వరమ్మ, శంకరమ్మ, సుజాత, ఆకాశ్, హన్మంతు, రామలింగం, వెంకటేష్,డి నర్సింలు, బండారి మల్లేష్, మారుతి, మారెప్ప జగ్గలి బాబు, జగ్గలి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area