మున్సిపాలిటీలలో పనితీరు ఆధారంగా గ్రేడ్‌లు

అమలవుతున్న పథకాల్లో ముందంజ
గుంటూరు,నవంబర్‌8 (జనం సాక్షి) :  మున్సిపల్‌ కార్పొరేషన్‌సహా జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో అమలు జరుగుతున్న ప్రగతి పనులు, పారిశుధ్యం, తాగునీటి సర ఫరా, మౌలిక వసతులకల్పన తదితర అంశాల ఆధారంగా మునిసిపాలిటీల పనితీరును ప్రభుత్వం అంచనావేస్తున్నది. జీవనోపాధి లక్ష్యం, మెప్మా, ప్లాన్‌ల మంజూరు, స్వచ్ఛాంధ్ర, నీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ, పన్నుల వసూలు, వ్యర్థాల నిర్వహణ, పౌర సేవలు, పేదలకు ఉపాధి భద్రత తదితర అంశాలను మునిసి పాలిటీల పనితీరు సూచికల్లో ప్రధానంగా ఉన్నాయి. ఈఅంశాల అమలులో తాడేపల్లి రాష్ట్రస్థాయిలో 6వ స్థానంలో, జిల్లాలో ప్రథమస్థానంల నిలిచింది. తాగునీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ పై మునిసిపాలిటీల పనితీరు ఆధారంగా ర్యాంకులను ప్రకటించారు. తాగునీటి సర ఫరా, వీధిదీపాల నిర్వహణ రెండు అంశాల అమలును పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ర్యాంకులను విడుదల చేసింది. మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌ భవన నిర్మాణాల కోసం ప్లాన్‌ల మంజూరులో మునిసి పాలిటీల పనితీరును అంచనావేస్తున్నారు. ప్లాన్‌ల మంజూరులో ఆన్‌లైన్‌ విధానం అమలవుతుండటంతో పురపాలక సంఘాలలో త్వరితగతిన ప్లాన్‌లు మంజూర వుతున్నాయి. ఈ విభాగంలో తాడేపల్లి, గుంటూరు కార్పొరేషన్‌, సత్తెనపల్తి, పిడుగురాళ్ళ మునిసిపాలిటీలు నిర్దేశిరచిన లక్ష్యాలను చేరుకోవడంలో ముందంజలో ఉన్నాయి. మాచర్ల, తెనాలి, రేప్లలె, పొన్నూరు, మంగళ గిరి, రేపల్లే మునిసిపాలి టీలు ఎ/-లాన్‌ల మం జూరులో పని తీరు పర్వాలేదు. చిలకలూరి పేట, నరసరావుపేట మునిసిపాలిటీలు లక్ష్యాలను సాధించడంలో చతికిలపడ్డాయి. సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ విభాగం కింద స్వయం సహాయక గ్రూపులకు బ్యాంకులు రుణాలు మంజూరు, జీవనోపాధి, నైపుణ్య శిక్షణ తరగతులు అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. ఈ మూడు అంశాల అమలులో బాపట్ల, మాచర్ల, మంగళగిరి, సత్తెనపల్లి, తెనాలి, పిడుగురాళ్ళ. తాడేపల్లి మునిసిపాల్టీలు ద్వితీయస్ధానంలో ఉన్నాయి. పచ్చదనం అమలుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించటం, ఉద్యానవనాల అభివృద్ధి తదితర అంశాలను పచ్చదనం అభివృద్ధి కింద ప్రభుత్వం చేర్చింది. మొక్కలు నాటేందుకు మునిసిపాలిటీలకు లక్ష్యాలను నిర్దేశించింది. ప్రభుత్వం సూచించినవిధంగా మొక్కలను నాటడంలో మునిసిపాలిటీల పనితీరు పర్వాలేదనిపించారు.
అలాగే ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం, నీటి భద్రత, గృహ భద్రత, నైపుణ్యాభివృద్ధి, పింఛ న్‌లు ఈ అంశాలను జీవనోపాధి సూచికల కింద చేర్చారు.