మున్సిపాలిటీలో ఉండలేం..

విలీన గ్రామాల ఐక్యవేదిక.

మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 23 (జనంసాక్షి). సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల అభివృద్ధి దూరంగా మిగిలిపోయామని సిరిసిల్ల మున్సిపల్ విలీన గ్రామాల ఐక్యవేదిక నాయకులు అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు బోల్గాం నాగరాజుగౌడ్, చేన్నమనేని కమలాకర్ రావు, తో పాటు నాయకులు మాట్లాడుతూ ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి బలవంతంగా సిరిసిల్ల మున్సిపాలిటీలో కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. విలీనం చేసే ముందే అభ్యంతరాలు తెలిపిన బలవంతంగా మున్సిపాలిటీలో విలీనం చేశారని విలీన గ్రామాల ప్రజలకు అప్పట్లో ఇచ్చిన ఏ ఓక్క హామీ కూడా మంత్రి కేటీఆర్ అమలు చేయలేకపోయారని మండిపడ్డారు. విలీన గ్రామాల పరిస్థితులను పట్టించుకునే నాధుడే కరువయ్యారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సిరిసిల్ల మున్సిపల్ విలీన గ్రామాలను వేరుచేసి సిరిసిల్ల అర్బన్ మండలం చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల అర్బన్ మండలం సాధన కోసం దశలవారీగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో సలేంద్రి బాలరాజు, మంగ కిరణ్, లింగంపల్లి మధుకర్, గంభీరావుపేట్ ప్రశాంత్, ఆది పెళ్లి శ్రీనివా,స్, అతికం నరసయ్య, తాడుక వెంకటేశం, బైరగోని పరుశురాం గౌడ్, బుర్ర మల్లేశం, గౌడ్ సలెండి వేణుగోపాల్, నీరటి శ్యామ్, రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.