ముసలిమడుగు ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి ప్రణాళిక.
రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర వారి ఆధ్వర్యంలో…
బూర్గంపహాడ్ అక్టోబర్ 15 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం ఐటిసి అనుబంధ సంస్థ రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర వారి ఆధ్వర్యంలో ముసలిమడుగు ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి ప్రణాళిక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రోటరీ డిస్ట్రిక్ట్ -3150 గవర్నర్ రాజశేఖర్ రెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు సూర్య భాస్కర్ రావు, కార్యదర్శి విజయకుమార్, ముసలిమడుగు గ్రామపంచాయతీ సర్పంచ్ వెంకటరమణ, జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, పాఠశాల ప్రధానో పాధ్యాయులు, గ్రామ పెద్దలు పంచాయతీ సిబ్బంది పాల్గొని అభివృద్ధికి ప్రణాళిక ఏర్పాటు చేశారు. ఈ సంధర్బంగా రోటరీ గవర్నర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి రోటరీ చేస్తున్న సేవలను కొనియాడారు. తదుపరి రోటరీ అధ్యక్షులు సూర్య భాస్కరరావు మాట్లాడుతూ రోటరీ తరపున ముసలిమడుగు పాఠశాలకు చేయబోతున్న కార్యక్రమాలను వివరించారు. రోటరీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు 200 జ్యూట్ బ్యాగులను స్థానిక గ్రామపంచాయతీ సర్పంచ్ చేతుల మీదుగా అందజేశారు. స్థానిక ప్రాథమిక పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు నోట్ పుస్తకాలను రోటరీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. పాఠశాల ఆవరణలో దాదాపుగా 20 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎలక్ట్ జే కే దాస్, రోటరీ పూర్వ అధ్యక్షులు షేక్ బాషా, చంద్రశేఖర్ యాగి, శ్రీధర్, మర్దన శ్రీనివాస్, బసప్ప రమేష్, జలగం చంద్రశేఖర్, సునీల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఏసోబు, శ్రీకాంత్, వెన్సాలాస్, ఖాదర్ వలీ, జ్యూట్ బ్యాంగుల దాత ఏసిఎంఈ రాజు తదితరులు పాల్గొన్నారు.