ముసాయిదా ఓటరు జాబితా పై సెప్టెంబర్ 19 వరకు అభ్యంతరాల స్వీకరణ
అక్టోబర్ 4 న తుది ఓటరు జాబిత ….. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , ఆగస్టు :::: ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే సెప్టెంబర్,19 లోగా తెలియజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కోరారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఆగస్ట్ 21న జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశామని, ఐదు నియోజకవర్గాలలో మొత్తం 12,40,016 జనరల్ ఓటర్లు, 357 సర్వీస్ ఓటర్లు, 64 ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ముసాయిదా జాబితాను పరిశీలించి ఓటరుగా పేరు లేకపోవడం,తప్పుల సవరణ, లిస్టులో ఉన్నటు వంటి పేర్లపై ఆక్షేపనలు, అభ్యంతరాలను సెప్టెంబర్ 19 వరకు స్వీకరిస్తారని తెలిపారు. వచ్చిన అక్షేపణ లను విచారణ చేసి సెప్టెంబర్ 28 లోగా ఆక్షేపణలు పరిష్కరిస్తారని తెలిపారు. అక్టోబర్ 4న తుది జాబితాను ప్రచురించడం జరుగుతందని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించుకుని అభ్యంతరాలు ఉన్నట్లయితే నిర్ణీత సమయంలోగా అందజేయాలన్నారు. కొత్త ఓటరు నమోదు కొరకు ఫారం-6, తప్పోప్పుల సవరణకు ఫారం-8, ఓటర్ల జాబితాలోని పేర్ల పై ఆక్షేపనలు, వలస పోయిన, చనిపోయిన వారి వివరాలు తెలపడానికి ఫారం-7 ను వినియోగించు కోవాలని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గంలో 2,05,410 జనరల్ ఓటర్లు, 67 మంది సర్వీస్ ఓటర్లు, సంగారెడ్డి నియోజకవర్గంలో 2,21,294 జనరల్ ఓటర్లు, 65 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఆందోల్ నియోజకవర్గం లో 2,28,399 జనరల్ ఓటర్లు, 48 మంది సర్వీస్ ఓటర్లు,5 గురు ప్రవాసఓటర్లు(ఎన్ఆర్ఐలు)జహీరాబాద్ నియోజకవర్గం లో 2,44,969 జనరల్ ఓటర్లు, 103 మంది సర్వీస్ ఓటర్లు, ముగ్గురు ప్రవాస ఓటర్లు ఉన్నారని, పటాన్చెరు నియోజకవర్గంలో 3,39,944 జనరల్ ఓటర్లు, 74 మంది సర్వీస్ ఓటర్లు, 56 మంది ప్రవాస ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఈనెల 26, 27న మరియు సెప్టెంబర్ 2, 3 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ఉందని, ఇట్టి అవకాశాన్ని వినియోగించు కోవాలని కలెక్టర్ సూచించారు.