ముస్లీింల అభివృద్ధి ప్రత్యేక కృషి
– స్పీకర్ మదుసూధనాచారి
హైదరాబాద్ ,జులై 3(జనంసాక్షి):ప్రభుత్వం ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తుందని సభాపతి మధుసూదనాచారి అన్నారు. కింగ్‌కోఠిలోని రూబీగార్డెన్‌లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు.ముస్లీంల కోసం బడ్జ్‌ట్‌లో పెద్దపీట వేసిందని షాదిముబారక్ లాంటి పధకాలతో ముందుకు వెళ్తున్నామన్నారు. గంగా, జమున-తహెజీబ్ తెలంగాణ సంస్కృతని ఇందుకు తమ సర్కార్ కట్టుబడి ఉందని అన్నారు. ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్‌కు కృషిచేస్తున్నామన్నారు. సోదరభావాన్ని పెంపోందిచే ఇఫ్తార్‌విందు జర్నలిస్టు సంఘంఏర్పాటు చేయడం పట్ల ఆయన అభినందించారు .మైనార్టీల పేదరికాన్ని పారదోలేందుకు ప్రభుత్వం అనేకరకాలుగా ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. . టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.పాల్గొన్న , ఐజేయూ సెక్రెటరీ దేవులపల్లి అమర్ , సంపాదకులు కే.శ్రీనివాస్ రెడ్డి , టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, కోటి రెడ్డి, మాజిద్ తదితరులు పాల్గొన్నారు.