మూగబోయిన సితార
ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ ఇకలేరు
ప్రముఖులు నివాళి
న్యూఢిల్లీ, డిసెంబర్ 12(జనంసాక్షి) :
సితార్ చిన్నబోయింది. సంగీత ప్రపంచం మూగబోయింది. ప్రముఖ సితార్ విద్యాంసుడు పండిట్ రవిశంకర్ (92) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన అమెరికాలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఏడాది కాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన గుండె కవాటు మార్పిడి కోసం శ్యాండిగోలోని స్క్రిప్స్ మెర్సీ ఆస్పత్రిలో గత గురువారం చేరారు. శస్త్రచికిత్స విజయవంతమైనప్పటికీ, ఆయన కోలుకోలేక పోయారు. చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారని రవిశంకర్ ఫౌండేషన్ ప్రకటించింది. హిందుస్థానీ సంగీతకారుడిగా, కంపోజర్‌గా ప్రసిద్ధి చెందిన రవిశంకర్‌కు భారత సంగీత రాయబారిగా మంచి పేరుంది. పాశ్యాత్య దేశాల్లో భారతీయ సంగీతానికి గుర్తింపు తీసుకురావడంలో ఎనలేని కృషి చేశారు. సంగీత ప్రపంచంలో తనకంటు విభిన్నమైన శైలిని సొంతం చేసుకున్నారాయన. అందుకే
ఎనలేని అవార్డులు ఆయన సొంతమయ్యాయి. మూడు సార్లు గ్రావిూ పురస్కారాలుత దక్కించుకున్నారు. భారత ప్రభుత్వం ఆయనను పౌర పురస్కారాలతో సత్కరించింది. అంతేకాదు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి సత్కారాలతో సన్మానించింది. 1999లో అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను ప్రధానం చేసింది. 92 ఏళ్ల వయస్సులోనూ ఆయన వచ్చే గ్రావిూ అవార్డుల పోటీల్లో నిలవడం గమనార్హం. సమకాలిన సంగీత ప్రపంచంలో మకుఠం లేని మహారాజుగా వెలుగొందిన రవిశంకర్ భారత్‌తో పాటు అమెరికాలోనూ నివసించే వారు. అమెరికాలో ఆయనను డాక్టరేట్లతో సన్మానించారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ఇయనను ‘ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్’తో సన్మానించారు.1920 ఏప్రిల్ 7న వారణాసిలో జన్మించిన రవిశంకర్ అసలు పేరు రబింద్రో శౌంకోర్ చౌదురి. నలుగురు అన్నదమ్ముల్లో ఆయనే చిన్నవాడు. తన బాల్యంలో నృత్యం నేర్చుకునేందుకు సోదరుడు ఉదయ్‌శంకర్‌తో కలిసి యూరప్ వెళ్లాడు. 1938లో నృత్యాన్ని పక్కబెట్టిన ఆయన సితార్ నేర్చుకోవడానికి అల్లాద్దిన్ ఖాన్ అనే విద్యాంసుడి వద్ద చేరారు. 1944లో చదువు పూర్తయిన అనంతరం మ్యూజిక్ కంపోజర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. సత్యజిత్ రే ‘అప్పు త్రిలోజీ’ చిత్రానికి పని చేశారు. 1949 నుంచి 1956 వరకు సంగీత దర్శకుడిగా ఢిల్లీలోని ఆలిండియా రేడియోకు సంగీత సేవలందించారు. 1956 నుంచి యూరప్, అమెరికాలో హిందుస్తాని క్లాసికల్ సంగీత ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. బోధన, ప్రదర్శనల ద్వారా హిందుస్తాని సంగీతానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు తీసుకువచ్చారు. తను కూతురు అనుష్క శంకర్‌తో కలిసి సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. 2003లో అనుష్క తన మ్యూజిక్ ఆల్బమ్ ద్వారా గ్రావిూ అవార్డుకు నామినేట్ అయ్యారు.
రవిశంకర్‌కు భార్య సుకన్య, కూతుర్లు నోరాజోన్స్, అనూష్క శంకర్ ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతును/-న సమయంలో ఆయన భార్యతో పాటు కూతురు రైట్ కూడా అక్కడే ఉన్నారు. ‘సంగీతానికి ఆత్మ, మంచి భర్త, తండ్రి అయిన పండిట్ రవి ఈ రోజు పరమపదించారని బరువెక్కిన హృదయాలతో తెలియజేస్తున్నాం. మేమేంతగా బాధ పడుతున్నామో విూరు కూడా అంతే బాధ పడుతుంటారని తెలుసు. సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆయన కోసం ప్రార్థనలు చేసిన అభిమానులనందరికీ ధన్యవాదాలు’ అని ఆయన భార్య సుకన్య, కూతరు రైట్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సంగీత విద్యాంసుడిగా, టీచర్‌గా, రచయితగా, ఎడిటర్‌గా ఆయన విభిన్న పాత్రలో పోషించారు. ఆయన తన ఆత్మకథ ‘రాగమాల’ను రచించారు. హరిసన్‌తో కలిసి అనేక ఆల్బమ్‌లు రూపొందించారు. రవిశంకర్, హరిసన్ కలిసి రూపొందించిన శంకర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఆల్బమ్‌లు రికార్డులు సృష్టించాయి. చాంట్స్ ఆఫ్ ఇండియా, ఫ్లవర్స్ ఆఫ్ ఇండియా, త్రీ రాగాస్, ది సౌండ్స్ ఆఫ్ ఇండియా వంటి పలు ఆల్బమ్స్ రూపొందించారు. రవిశంకర్ భారత్‌తో పాటు కెనడా, యూరోప్, అమెరికా చిత్రాలకు కూడా కంపోజ్ చేశారు. ‘సారేజహాసే అచ్చా’కు మహమ్మద్ ఇక్బాల్‌తో కలిసి నూతన మెలోడీ రాశారు. ఈ నేపథ్యంలో మెగసెసె అవార్డు దక్కించుకున్న ఆయన 1986లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అప్పటి నుంచి 1992 వరకు ఎంపీగా వ్యవహరించారు. ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.