మూడిళ్లలో చోరీ
ఎలిగేడు: మండలంలోని నర్సాపూర్‌లో ఎస్టీ కాలనీలోని మూడు ఇళ్లల్లో బుధవారం అర్థరాత్రి దొంగతనాలు
జరిగాయి. మేకల కొమరయ్య అనే వ్యక్తి ఇంట్లో రెండున్నర తులాల బంగారం ఆభరణాల రూ.15 వేల నగదు, రాఘవ అనే వ్యక్తి ఇంట్లో 15 వేల నగదు, లింగయ్య అనే వ్యక్తి ఇంట్లో తులం బంగారం అపహరించినట్లు బాధితులు తెలిపారు.