మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు
హైదరాబాద్,(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్దమైంది. ఈ నెల 15 లేదా 17 న ఎన్నికల షెడ్యూలు విడుదల కానున్నట్లు సమాచారం. జూన్ చివరి వారంలో మొదటి విడత , వచ్చే నెల మొదటి వారంలో రెండో, మూడో విడత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ నిష్పత్తిని ఖరారు చుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఒకటి రెండు రోజుల్లో రిజర్వేషన్ల ప్రకారం కేటాయింపు జరగనునన్నట్లు తెలుస్తుంది.