మూడు నేమళ్లు మృతి

గంగాధర: కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలోని ఉప్పరమల్యాల గ్రామంలోని గుండ్ల చెరువులో మూడు నెమళ్లు మృతి చెందాయి. ఉపాధిహామీ పథకంలో భాగంగా పూడికతీత పనులకు వెళ్లిన కూలీలు మృతి చెందిన నెమళ్లను చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చెరువులో అడుగంటిన నీటిని తాగి నెమళ్లు మృతిచెంది ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. నెమళ్లకు శవ పరీక్ష నిర్వహించి దహనం చేయనున్నట్లు అటవీశాఖ అధికారి జగన్మోహన్‌ తెలిపారు.