మూడు రోజుల్లో చిరుజల్లులు వాతావరణ శాస్త్రవేత్తల సూచన

బుక్కరాయసముద్రం, : జిల్లాలో రాబోవు  మూడు రోజుల్లో చిరుజల్లులు పడే సూచనలు ఉన్నాట్లు ఆచార్య ఎన్‌ జి. రంగా వ్యవసాయ పరీశోధనా స్థానం రేకులకుంట ప్రధానశాస్త్రవేత్త ప్రతావ్‌ రెడ్డి,సీనియర్‌ శాస్త్రవేత్తలు సహాదేవరెడ్డి, మల్లేశ్వరి సాంకేతిక ఆధికారి వెంకట్రావు శనివారం పేర్కోన్నారు. మూడు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతతలు వెంకట్రావు శనివారం 31 నుంచి 32, రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 24 సెంటీగ్రేడులుగా నమోదు కావచ్చునని చెప్పారు. పప్పుశనగ విత్తనం నంబరు 15 వ తేదీ వరకు  విత్తుకొనేందుకు అనువైన సమయంన్నారు జె.జి 11, 130, జేఏకేవై 9218 అనే రకాలను ఎకరానికి 30 నుంచి  40 కిలోలను విత్తుకోవడం మంచిదని రైతులకు సూచించారు. ప్రస్తుత వాతవారణ పరిస్థితులకు అనుకూలంగా ఉలవ పంటను రైతులకు సూచించారు. ప్రస్తుత వాతవరణ పరిస్థితులకు అనుకూలంగా ఉలవ పంటను వేసుకోవాడానికి ఆనుకూమన్నారు. ఎకరానికి 8 నుంచి 12 కిలోల విత్తనం అవసరం అవుతుందని వివారించారు. రబీ వేరుసెనగ విత్తుకొనేందుకు డినెంబరు 15 వరకు అనువైన సమయని సూచించారు.