మూడు సంవత్సరాలు గడిచిన బిల్లు రాలేదు
బషీరాబాద్ అక్టోబర్18, (జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో అరో వార్డు, ఏడో వార్డు,ఎనిమిదో వార్డులో పంచాయతీ నిధులతో మురికి కాలువలు పనినీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కే.రాజారత్నం పూర్తి చేసాను. మూడు సంవత్సరాలు గడిచిన కూడా ఇప్పటి వరకు బిల్లు రాకపోవడం వలన చింతిస్తున్నాను.ఈ సందర్భం లో మార్కెట్ కమిటీ చైర్మన్ కే. రాజారత్నం మాట్లాడుతూ బషీరాబాద్ మండల కేంద్రంలో పలు వార్డులలో మూడు లక్షల పంచాయతీ నిధులతో మురికి కాలువలను నిర్మించడం జరిగింది. ఎం.బి రికార్డ్ పూర్తి అయింది.చెక్ మేజర్ కూడా అయింది కానీ ఎం.బి లు ఆడిట్లో ఉన్నాయని గ్రామ సర్పంచ్ పూడూరు ప్రియాంక శ్రావణ్ కుమార్ మరియు పంచాయతీ కార్యదర్శి శేఖర్ చెపుతున్నారని.మూడు సంవత్సరాలు గడిచినా కూడా నాకు చెక్ ఇవ్వపోవడం బాధాకర విషయం అని చెప్పారు. కొందరు పంచాయతీ నిధులతో ఆర్ఎంబి రోడ్డును మరమ్మతులు చేశామంటూ ఎం.బి లు రికార్డు చేసుకున్నారు. కానీ ఆ పనితీరు చూస్తే మీకే అర్థం అవుతుంది.దీనిపైన అధికారులు సున్నం బట్టి నుండి గ్రామపంచాయతీ వరకు ఆర్ఎంబి రోడ్డును పరిశీలించి ఎం.బిలు రికార్డు చేయాలని డిమాండ్ చేశారు.పని చేసిన వాళ్లకు బిల్లు ఇవ్వటానికి ఎందుకింత ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.