మూడెకరాల పంపిణీ ఎక్కడ?

ఆదిలాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): ఎన్నికల్లో ఇచ్చిన హావిూలు డబుల్‌ బెడ్‌, దళితులకు మూడెకరాల భూపంపిణీ తదితర కార్యక్రమాలను తెరాస ప్రభుత్వం ఎక్కడ అమలు చేయడం లేదని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి విమర్శించారు.రైతులకు సమస్యలు లేవని, వారంతా హాయిగా ఉన్నారంటూ సిఎం కెసిఆర్‌ చేస్తున్న ప్రకటనలు కేవలం సమస్యలను పక్కదోవ పట్టించడమేనని ఆరోపించారు. తెరాస ప్రభుత్వం రైతులనే కాకుండా సామాన్య జనాన్ని విస్మరిస్తుందని పేర్కొన్నారు. అధికవర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు. పత్తిపంట అధికంగా సాగవుతున్న జిల్లాలో ఈయేడు వర్షాల కారణంగా నష్టపోయారని తెలిపారు. ఇందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తూ రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండు చేశారు. ప్రభుత్వ పాలన తీరుపట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఆరోపించారు. వాస్తవంగా పంటపొలాల్లోకి వెళ్లి చూస్తేనే రైతుల బాధలు అరమవుతాయని పేర్కొన్నారు. రైతులు నకిలీ విత్తనాలు వేసి నష్టపోయిన బాధల్లో ఉంటే పటట్‌ఇంచుకోవడం లేదని అన్నారు. ఆయా జిల్లాల్లో ఎంతోమంది రైతులు నకిలీ మిరప విత్తనాలు వేసి లక్షల పెట్టుబడి పెట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. అధిక వర్షాలకు పత్తిపంట మొత్తం పాడైపోయిందన్నారు. ఒక వైపు నకిలీ విత్తనాలు, మరో వైపు అకాల వర్షాలకు అన్నదాతలు తీవ్రమైన బాధల్లో ఉంటే కనీసం మంత్రులు కానీ, వ్యవసాయశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఇలా ఎవరూ కూడా రైతుల వద్దకు వచ్చి పరామర్శించిన దాఖలాలు లేవన్నారు. పత్తి, మిరప, మొక్కజొన్న పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు.