మూఢనమ్మకాలు నమ్మకండి – సీ.ఐ సతీష్.

కూసుమంచి ఆగస్టు 13 ( జనం సాక్షి ) : మూఢనమ్మకాలు నమ్మి జీవితాలను పాడు చేసుకోవద్దని బాణామతి, చేతబడి, కేవలం అబూత కల్పనలు ఇలాంటివి నమ్మి ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ అన్నారు. వివరాల్లోకి వెళితే మండలంలోని భగత్ త్వీడు గ్రామపంచాయతీలో గత అర్ధరాత్రి డంపింగ్ యార్డ్ లో బియ్యం, పసుపు, కుంకుమ, రూపాయి నాణేలు, స్థానిక సర్పంచి బర్మావత్ రవి, అతని భార్య పెంటి, ఫోటోలు పెట్టి వెళ్లారు దానిని చూసినా తండావాసులు పెద్ద ఎత్తున చేతబడి చేశారని అప నమ్మకంతో పోలీసు వారికి ఫిర్యాదు చేయగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్, యాసా నందీప్ సిబ్బందితో అచటికి వెళ్లి పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారు చెప్పిన విషయాలను సానుకూలంగా విని మీరు ఎలాంటి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని కేవలం ప్రజలను భయపెట్టడానికి చేసిన పనిగా ఆయన వారికి తెలిపారు ఇలాంటి పనులు చేసే వారిని ఎవరినైనా వదిలిపెట్టబోమని విచారణ చేసి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వారికి ధైర్యం చెప్పారు  మళ్లీ ఇలాంటి సంఘటన లు జరగకుండా తగు విచారణ జరిపి ఇలాంటి పనులు చేసే వారిని గుర్తించి  మాకు న్యాయం చేయాలని సర్పంచ్ బర్మావత్ రవి, నందా, యలమంద, తండావాసులు, సిఐ కి విజ్ఞప్తి చేశారు.