మూఢనమ్మకాల పై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

కొత్తగూడ సెప్టెంబర్ 29 జనంసాక్షి:మంత్రాలు,చేతబడులంటూ మోసపోతున్న ఏజెన్సీ గ్రామీణులను చైతన్యవంతులను చెయ్యడానికి పోలీస్ శాఖ పూనుకుంది.కొత్తగూడ మండలం క్రిష్టపురం గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులకు శాస్త్రీయ విజ్ఞానంపై కళాజాత బృందం తో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం స్థానిక ఎస్సై నగేష్ మాట్లాడుతూ మంత్రాలు,చేతబడులు లేవని,ఇలాంటివి నమ్మి ఆర్థికంగా మోసపోవద్దని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.