‘మూల్యాంకనం’లో జూనియర్లకే పెద్దపీట
కరీంనగర్ ఎడ్యూకేషన్, జనంసాక్షి: ఈనెల 12 నుంచి పారంభమైన పదో తరగతి మూల్యాంకనంలో జూనియర్లకే పెద్దపీట వేశారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. సీనియారిటీ ప్రాతిపదికన చీఫ్ ఎగ్జామినర్ (సీఈ)లు ఇవ్వాలి ఉండగా… స్కూల్ అసిస్టెంట్లకు సీఈ బాధ్యతలు అప్పగించడంపై పీజీహెచ్‌ఎంలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పీజీహెచ్‌ఎంలకు ఏసీఓలుగా ఇచ్చారని, జూనియర్లకు పెద్దపీట వేస్తూ, సీనియర్లను అవమాన పరచడం సబబు కాదని ఉపాధ్యాయులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. తమను విధుల నుంచి విడుదల చేయాలని కోరితే, నిబంధనలు ఒప్పుకోవంటూ డీఈఓ తిరస్కరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా డీఈఓ తన ధోరణి మార్పుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.