*మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత.
చిట్యాల15(జనంసాక్షి) మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన తడుక కనక రాజం గౌడ్ గీత కార్మికుడు కులవృత్తిలో భాగంగా గత పది రోజుల క్రితం కల్లు గిస్తూ తాటి చెట్టు పైనుంచి కిందపడి మృతి చెందినాడు. విషయం తెలుసుకున్న సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం జిల్లా నాయకులు వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే వీరస్వామి గౌడ్ ద్వారా తాడి కార్పోరేషన్ చైర్మన్ బిసి సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం గౌడ్ కు సమాచారం అందించారు. దాంతో వెంటనే స్పందించి తక్షణ సాయం కింద వారి కుటుంబానికి ఇరవై అయిదు వేల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసారు. కాగా మంజూరు చేసిన రూ 25 వేల చెక్కును సర్వాయి పాపన్న మోకుదెబ్బగౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం భిక్షపతిగౌడ్ , జిల్లా అధ్యక్షులు మాటూరి రవీందర్ గౌడ్ , చిట్యాల మండల అధ్యక్షులు మూల రమేష్ గౌడ్,ఏబీసీడీవో క్రాంతి కిరణ్ మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. తమ కుటుంబాన్ని పోషించే యజమాని చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్న తమకు ఆర్థికసాయం అందజేసిన బుర్ర వెంకటేశం గౌడ్, డిబీసీడీవో శైలజ, వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే వీరస్వామి గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం భిక్షపతిగౌడ్, జిల్లా అధ్యక్షులు మాటూరి రవీందర్ గౌడ్ , మండల అధ్యక్షులు మూల రమేష్ గౌడ్లకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం మండల యూత్ అధ్యక్షులు ఉయ్యాల రమేష్ గౌడ్ , బత్తిని శంకర్ గౌడ్ ,గోపాలపురం గౌడ కులస్తులు మూల శంకర్ గౌడ్ ,ఏరుకొండ గణపతిగౌడ్ , ఏరుకొండ రఘు గౌడ్, బత్తిని నారాయణగౌడ్, బత్తిని సదయ్య గౌడ్, పోశాల పైడయ్య గౌడ్ ,కొరుకొప్పుల అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.