మృతుడి కుటుంబానికి రజక సంఘం ఆర్థిక సహాయం

జగదేవ్ పూర్ మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం మృతి చెందిన బస్వరాజు నర్సింలు కుటుంబానికి జగదేవ్ పూర్ మండల రజక సంఘం తరపున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా రజక సంఘం మండల అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ ఆధ్వర్యంలో పలువురుల రజక సంఘం నాయకులు బుధవారం బస్వాపూర్ గ్రామంలో మృతుడు నర్సింలు కుటుంబ సభ్యులను పరామర్శించి అతని భార్య స్వప్నకు రూ.5000లు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన బస్వరాజు నర్సింలు అకాలమరణం చెందడంతో  మృతుడి భార్య మగ్గురు కూతుళ్ళు రోడ్డున పడ్డారని విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల రజక సంఘం గౌరవాద్యక్షుడు అక్కారం నర్సింలు, ఉపాధ్యక్షులు రాచకొండ యాదగిరి, వడ్లకొండ శ్రీనివాస్, ఎడపల్లి వెంకటయ్య, కోశాధికారి రాచకొండ బాల్ నర్సయ్య, సంయుక్త కార్యదర్శి బస్వరాజు ఏగొండ, యాదగిరి, అలిరాజపేట రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల నర్సింలు, బస్వాపూర్ గ్రామ రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.