మృతురాలి కుటుంబానికి చేయూత..
15వేల ఆర్ధిక సహాయం.
ఊరుకొండ, అక్టోబర్ 12 (జనంసాక్షి):
ఊర్కోండ మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గువ్వ నాగమ్మ(55) అనారోగ్యంతో మృతి చెందింది. స్థానిక
ఎంపీటీసీ కలిమిచెర్ల గోపాల్ గుప్తా, సర్పంచ్ శివారాణి హరీష్ ల ద్వారా ఈ విషయం తెలుసుకున్న స్థానిక శాసన సభ్యులు చార్లకోల లక్ష్మారెడ్డి మరియు జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డిలు తమ ప్రగాఢ సానుభుతి తెలియజేస్తూ.. 10వేల ఆర్థిక సాయం అంద చేశారు. ఎంపీటీసీ కలిమిచెర్ల గోపాల్ గుప్తా 3వేలు మరియు గ్రామ సర్పంచ్ శివరాణి హరీష్ 2వేలు మొత్తము 15వేల ఆర్థిక సహాయాన్ని వాయిదా కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు హరీష్, వెంకటేష్, గోవిందు సుధాకర్, గోవిందు వెంకటేష్, మెక్కొండ రాములు, గువ్వ నాగేష్, తదితరులు పాల్గొన్నారు.