మృతుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించాలి
అట్ల పక్షాలజులై 15 (జనం సాక్షి )నాంపల్లి మండలం స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన తల్లోజు అరుణ్, నల్లపు ప్రశాంత్ గ్రామంలోని మిషన్ భగీరథ ప్లాంటేషన్లో విధులు నిర్వహిస్తూ రాఘవ కన్స్ట్రక్షన్స్ వారి ఒత్తిడితో సంస్థాన్ నారాయణపురం మండలం మర్రిబావి తండా వద్ద విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై ఇరువురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా వారి పార్థివ దేహాలను చౌటుప్పల్ మార్చురీకి పోస్టుమార్టం కోసం తరలించగా మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉదయం నుండి స్వాములవారి లింగోటం గ్రామంలోని మిషన్ భగీరథ నీటి శుద్ధి ప్లాంటేషన్ గేటు ముందు అట్లపక్షాల ఆధ్వర్యంలో ధర్నా కొనసాగుతుండగా రాఘవ కన్స్ట్రక్షన్స్ మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులతో చర్చలు జరపడానికి పెద్ద మనుషులు రావాలని ఆహ్వానించడంతో గ్రామ సర్పంచ్ అంగిరేకుల పాండు,నాంపల్లి ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పూల వెంకటయ్య, సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి గ్రామ పెద్దలు చర్చలకు వెళ్లారు చర్చలు సఫలమైనట్టు విశ్లేషణీయ సమాచారం అందింది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి సుమారు పది లక్షల రూపాయల చొప్పున ఇవ్వడానికి రాఘవ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం అంగీకారం తెలపడంతో పాటు మృతుల కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి ఉద్యోగం ఇవ్వడానికి గాయపడిన వ్యక్తికి సైతం ఉద్యోగం ఇవ్వడానికి సమతించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో గట్టుపల్లి నర్సిరెడ్డి, ఎంపిటిసి బెక్కం రమేష్ బి ఎస్ పి జిల్లా నాయకుడు పూదరి సైదులు, బిజెపి మండల నాయకుడు సుధాకర్ రెడ్డి, నాంపల్లి సతీష్, దోటి పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area