మృత్యుంజయపై కరీంనగర్‌ కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీకి నష్టం చేకూరుస్తున్న పీసీసీ అధికార ప్రతినిధి మృత్యుంజయపై చర్య తీసుకోవాలని కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలు పీసీసీ అధ్వక్షుడు బొత్సను కోరారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు రవీందర్‌రావు, ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ సంతోష్‌ కుమార్‌ గాంధీ భవన్‌లో బొత్సను శనివారం కలిశారు. జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు పై మృత్యుంజయ అనవసర అరోపణలు చేస్తున్నారని, పార్టీకి చీడపురుగులా తయానయ్యారని అరోపించారు. మృత్యుంజయానికి నోటీసులు జారీ చేసి వివరణ అందాక తగు చర్యలు తీసుకుంటామని బొత్స వారికి హామీ ఇచ్చారు.