మృత్యుమార్గంగా రాజీవ్‌ రహదారి

నిత్యకృత్యమైన ప్రమాదాలు

సిద్దిపేట,నవంబర్‌21  (జనం సాక్షి) : రాజీవ్‌ రహదారిలో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాల కారణంగా ఇది మృత్యుదారిగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ఈ రోడ్డు నిర్మాణ సమయంలో ప్రమాణాలు పాటించకపోవడం వల్లనిత్యం ప్రమాదాలు సర్వ సాధారణం అయ్యాయి. ఈ రోడ్డులో అనేక మలుపులు కూడా ప్రమాదాలకు కారణంగా మారింది. ఎదురుగా ఉన్న వాహనం కనపడక ప్రమాదాలు జరుగు తున్నాయి. ప్రజ్ఞాపూర్‌ నుంచి మొదలు కరీంనగర్‌ వరకు అనేక మలుపు కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదాలు జరుగుతన్న తీరు చూస్తే ప్రయాణం ఈ రోడ్డులో సేఫ్‌ కాదని తెలుసుకోవచ్చు. ఈ రోడ్డు మలుపులను తొలగించాలని ఉద్యమ సమయంలో అధికార టిఆర్‌ఎస్‌ ఆందోళన చేసింది. అయితే ఇప్పుడు అదికారంలో ఉన్నా దీని విస్తరణ అలాగే ఉండిపోయింది. దీంతో ప్రమాదాలు తప్పడం లేదు. ఘోర రోడ్డు ప్రమాదాలు జరగడంతో అనేక కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంటున్నది.