మెండోరా మండల కేంద్రంలోయాసంగి సాగుపై అవగాహన సదస్సు

నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామంలో మెండోరా మండల వ్యవసాయ అధికారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో రైతులను ఉద్దేశించి సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సులో పిఎం కిసాన్ ఈ కేవైసీ, ఎర్ర జొన్న రైతు బీమా ఒప్పందం గురించి, ఆయిల్ పామ్ పంటసాగు పై అవగాహన సదస్సును ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మెండోరా మండలంలో ఈ ఆసంగికి 40 ఎకరాల వరకు రైతులు సాగు చేసుకొనుటకు రాయితీపై ఆయిల్ఫామ్ మొక్కలను అందించడం జరుగుతుంది. ఆయిల్ దిగుమతి చేసుకునే బదులు పామాయిల్ పండించడం వల్ల వంట నూనెల్లో సమృద్ధిగా మన దగ్గరనే ఏర్పరచుకునే దాని కొరకు ఈ ఆయిల్ పంప్ పంటను సాగు చేయడానికి ప్రభుత్వం పైన తెలిపిన రాయితీలను అందిస్తుందన్నారు . ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సభ్యులు టి గంగాధర్ సొసైటీ చైర్మన్ ఎం రాజారెడ్డి రైతు కోఆర్డినేటర్ ఎం వెంకట్రెడ్డి AEO అలేఖ్య మరియు రైతులు పాల్గొన్నారు