మెట్ పల్లిలో జాబ్మేళా
మెట్పల్లి గ్రామీణం: మెట్పల్లి మండల పరిషత్తు సమావేశ మందిరంలో శనివారం డీఆర్డీఏ, రాజీవ్ యువకిరణాలు ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. మెట్పల్లి , మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన 60 మంది నిరుద్యోగ యువతీయువకులు పలు కోర్సుల్లో శిక్షణకు, ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. న్యాక్రోబయో ఫెస్టిసైట్స్, రైతు మిత్ర బయో ఫెస్టిసైట్స్ కంపెనీలు మేళాలో పాల్గొనగా ఎంపిక చేసిన అభ్యర్థలకు జగిత్యాల డివిజన్లోని మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగం కల్పిస్తామని డీఆర్డీఏ ప్లేన్మెంట్ ఎగ్జిక్యూటివ్ శ్రీధర్ తెలిపారు.