మెట్ పల్లిలో పలు వార్డులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్*

మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 11 :జనంసాక్షి
మెట్పల్లి పట్టణంలో మంగళవారం అడిషనల్ కలెక్టర్ అరుణ మెట్పల్లి మున్సిపల్ లోని నాలుగవ వార్డు, ఏడవ వార్డు , 12వ వార్డులో 13వ వార్డులో పర్యటించి పారిశుద్ధ్య పనులను కుబుసింగ్ కుంట పార్కును పరిశీలించారు ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ మురికి కాలువలు అవసరమున్న చోట ప్రతిపాదనను పంపాలని తెలిపినారు. మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని కుబుసింగ్ కుంట పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని ఫౌంటేపేషన్ ఏర్పాటు చేయాలని పార్క్ లోకి నీరు వస్తున్నది అది క్లియర్ చేసి నీరు వెళ్లడానికి మురికి కాల్వ కట్టించాలని తెలిపారు. ఏడవ వార్డులో కొత్తగా కడుతున్న మార్కెట్ పనులను పర్యవేక్షించారు డిసెంబర్ లోగా మొత్తం మార్కెట్ పనులు పూర్తి చేయాలని అదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య, ఏఈ అరుణ్ కుమార్ , ముజీబ్ కౌన్సిలర్ లు మన్నేఖాన్ , షాకీర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు