మెదక్‌లో క్వింటాలు గంజాయి స్వాధీనం
మెదక్: గుట్టుచప్పుడు కాకుండా భారీ ఎత్తున తరలిస్తున్న గంజాయిని మెదక్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో కాపుకాసిన పోలీసులు తూప్రాన్ బస్టాండ్‌లో క్వింటాలు గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.