మెదక్‌లో మారిన రాజకీయ సవిూకరణం

తమ్ముడికి మద్దతుగా పోటీ నుంచి వైదొలగిన శశిధర్‌ రెడ్డి

పోటీలోనే ఉన్న తెజస అభ్యర్థి

టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌ రెడ్డికి సానుకూలంగా పరిణామాలు

మెదక్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): మెదక్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న అన్నదమ్ముళ్లు ఏకం కావడంతో రాజకయీ ముఖచిత్రం మారింది. అయితే టిజెఎస్‌ అభ్యర్తికి మద్దతుగా మాత్రం కాదు. అటు కాంగ్రెస్‌, ఇటు టిజెఎస్‌ రంగంలో ఉండడం ఖాయంగా మారింది. కాంగ్రెస్‌ చివరి నిముషంలో మాజీ ఎమ్మెల్యే వశిధర్‌ రెడ్డిని బుజ్జగించి, తమ్ముడికి లైన్‌ క్లీయర్‌ చేసింది. ఎన్నికల్లో పోటీకి దిగిన అన్నదమ్ములు ఒకటిగా కలిసిపోయారు. తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో ఉన్న శశిధర్‌రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపురాగా భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హావిూ ఇవ్వడంతో కాంగ్రెస్‌ అభ్యర్థిని బలపరిచేందుకు సమ్మతించి… తమ్ముడికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

అన్నదమ్ముళ్ల కలయికతో మెదక్‌ నియోజకవర్‌గ్గంలో రాజకీయ సవిూకరణాలు మారినట్లు విశ్లేషకులు అంటున్నారు. చివరివరకు వేర్వేరుగా ప్రచారం కొనసాగిస్తారా… పార్టీ తిరుగుబాటు అభ్యర్థిగా కొనసాగి ఓట్లు చీలిపోయి ప్రత్యర్థులకు లాభం చేకూరుస్తారా అనుకుంటున్న తరుణంలో తమ్ముడి కోసం అన్న తనే త్యాగం చేశారు. ప్దదెమినేళ్లుగా నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున టిక్కెట్‌ ఆశించారు. మహాకూటమి పొత్తులో భాగంగా తెజసకు కేటాయించగా… నామినేషన్‌ చివరి రోజున కాంగ్రెస్‌ అధిష్ఠానం శశిధర్‌రెడ్డి సోదరుడు ఉపేందర్‌రెడ్డికి టిక్కెట్‌ కేటాయించింది. దీంతో కాంగ్రెస్‌ బీ-ఫాం దక్కక పోవడంతో శశిధర్‌రెడ్డి ఎన్‌సీపీ (నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ) తరఫున బరిలో నిలిచారు. సోదరులే బరిలో నిలవడంతో అందరి దృష్టి మెదక్‌పై పడింది. ఈ నేపథ్యంలో ఉపేందర్‌రెడ్డి తన అన్నను బుజ్జగించి నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా ప్రయత్నిస్తానని ప్రకటించగా… నామినేషన్‌ను ఉపసంహరించుకుంటారని అంతా భావించారు. అయినా ఆయన బరిలో కొనసాగుతూ వచ్చారు. శశిధర్‌రెడ్డి వర్గీయులు, కార్యకర్తల్లో కొందరు పార్టీ అభ్యర్థికి మద్దతు పలకడం, బరిలో నుంచి తప్పుకొని సోదరుడికి మద్దతు ఇవ్వాలని కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు శశిధర్‌రెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. నామినేషన్‌ దాఖలు చివరిరోజున ఎన్‌సీపీ తరఫున నామపత్రాలు సమర్పించిన అనంతరం జిల్లా కేంద్రం మెదక్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రచార రథాలను కూడా సిద్ధం చేసుకున్నారు. బరిలో అన్నదమ్ములు ఉంటే ఓట్లు చీలి ప్రత్యర్థులకు లాభం చేకూరుతుందంటూ అనుచరులు, కుటుంబసభ్యులు శశిధర్‌రెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఆయన పునరాలోచనలో పడ్డారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి పిలుపు రావడంతో అనుచరులతో కలిసి వెళ్లి ఆయన్ను కలిశారు. 2004, 2014 ఎన్నికల్లో తనకు జరిగిన అన్యాయాన్ని ఉత్తమ్‌కు వివరించారు. నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వస్తున్న తనకు టిక్కెట్‌ ఇవ్వక పోవడాన్ని తప్పుపట్టారు. స్పందించిన ఆయన వచ్చే ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి రానుందని, అప్పుడు సముచిత స్థానం కల్పిస్తామని హావిూ ఇచ్చి… ఉపేందర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయాలని సూచించారు. అధిష్ఠానం సూచన మేరకు శశిధర్‌రెడ్డి కార్యకర్తలతో చర్చించి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌ గెలుపునకు కృషిచేస్తామని శశిధర్‌రెడ్డి ప్రకటించారు. తమ్ముడి తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. అయితే పొత్తులో భగంగా టిజెఎస్‌ అభ్యర్థి కూడా రంగంలో ఉన్నారు. దీంతో ప్రస్తుత మాజీ మెమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డికి గెలుపు సునాయసం అయ్యిందని అంటున్నారు. అటు కాంగ్రెస్‌, ఇటు టిజెఎస్‌ పోటీ వల్ల ఆమెకు సానుకూలంగా మరిందని భావిస్తున్నారు.