మెదక్ చర్చిని సందర్శించిన సీఎం
మెదక్(అర్బన్) అసియా ఖండంలో పెద్ద చర్చిల్లో ఒకటైన మెదక్ చర్చిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్బంగా అయన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మత గురువుల అశీస్సులను పోందారు. చర్చి ప్రాముఖ్యతను మత గురువులు అయనకు వివరించారు. సీఎం వెంట మంత్రులు డీకె అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యెలు హనుమంతరావు,నర్సారెడ్డి తదితరులు చర్చిని సందర్శించారు.